రాయికల్
అత్యవసర సమయంలో రక్తం ,ప్లేట్లెట్స్ దానం చేసిన రాయికల్ వాసులు

viswatelangana.com
September 24th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కేంద్రంలో భారతి బ్లడ్ బ్యాంక్ నందు పెగడపల్లి మండలం కు చెందిన నాగునూరి రమేష్ అనే వ్యక్తికి శాస్త్ర చికిత్స నిమిత్తం బి పాజిటివ్ బ్లడ్ అవసరమని డోనర్స్ గ్రూపులో తెలపగా రాయికల్ నాలుగవ వార్డుకు చెందిన కుర్మ ప్రేమ్ రెడ్డి వెంటనే స్పందించి అత్యవసర సమయంలో 10వ సారి బ్లడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల పట్టణానికి చెందిన డాక్టర్ విశాల్ అనే వైద్య విద్యార్థికి డెంగ్యూతో బాధపడుతుండగా ప్లేట్లెట్స్ తీవ్రంగా పడిపోవడంతో అత్యవసరంగా ఏబి పాజిటివ్ రక్త కణాలు అవసరం ఉండడంతో సమాచారం తెలుసుకున్న రాయికల్ కు చెందిన పాత్రికేయుడు నాగమల్ల శ్రీకర్ స్పందించి రక్త కణాలు దానం చేశారు. ఈ సందర్భంగా ఆయనను జేఏసీ, ప్రెస్ క్లబ్ సభ్యులు, పలువురు నాయకులు అభినందించారు.




