కోరుట్ల
ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవ వేడుకలు

viswatelangana.com
September 25th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల ఏరియా ఆసుపత్రిలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరిపారు. రోగులకు ముందుగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి, కేక్ కట్ చేసి, అనంతరం గ్రేడ్ వన్ ఫార్మసిస్ట్ పి.అనూజ్ కుమార్, సీనియర్ ఫార్మసిస్ట్ సి. ఉదయ్ ప్రసాద్, చిరంజీవి, అనురాధ, శైలజ ఫార్మసిస్టు లను ఆర్ఎంవో డాక్టర్ వినోద్ కుమార్ లు శాలువాలతో ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడుతూ.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఫార్మసిస్టు కీలక వ్యక్తులు అలాగే వైద్య ఆరోగ్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని మందుల తయారీ నుండి వాటి నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించుట వ్యాధిగ్రస్తులకు మంచి మందులు వినియోగం పట్ల తగు సూచనలు సలహాలు ఇవ్వడం వాటి దుష్ఫలితాల పట్ల అవగాహన కల్పించడంలో ఫార్మసిస్ట్‌ల పాత్ర వెలకట్టలేనిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి వివిధ కేడర్ల సిబ్బంది పాల్గొన్నారు.



