జగిత్యాల

బీపి ఆపరేటర్ తో చెక్ చేయకుండానే బీపి నిర్ధారణ చేసిన సిస్టర్

బీపి హెచ్చుతగ్గులతో పేషెంట్ మరణిస్తే ఎవరిది బాధ్యత?

viswatelangana.com

September 25th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

స్థానిక జగిత్యాల పట్టణంలో గల సివిల్ ఆసుపత్రిలో నరేష్ అనే ఓ వ్యక్తి తన బంధువు అయిన గంగాధర్ కు గత కొద్ది రోజుల నుంచి ఒళ్ళు వేడి చేయడంతో స్థానిక సివిల్ ఆస్పత్రిలో వైద్యం పొందడానికి వెళ్లిన పేషెంట్ కు చుక్కెదురైంది. వివరాల్లోకెళితే జ్వరంతో బాధపడుతున్న పేషంట్ అత్యసర విభాగంలో గల వైద్యున్ని సంప్రదించడానికి వెళ్లిన క్రమంలో అక్కడే ఉన్న డాక్టర్ ఆదేశానుసారం ,పేషెంట్ యొక్క పరిస్థితి ని బట్టి అడ్మిట్ కావాల్సిందేనని డాక్టర్ తెలుపగా ,అక్కడే డ్యూటీ లో ఉన్న సిస్టర్ పేషెంట్ కు కేటాయించిన కేస్ షీట్ బుక్ లో పేషంటును నాడీ పట్టకుండానే పల్స్ గమనించకుండానే బీపి అధికంగా ఉందని నిర్ధారణ చేసి ట్రీట్మెంట్ చేసే ప్రయత్నాన్ని గమనించిన పేషెంట్ తరపు బంధువైన నరేష్ అడ్డుకొని మీరు బీపి చెక్ చేయకుండానే బీపీ ని నమోదు చేసుకొని ఎలా ట్రీట్మెంట్ చేస్తారు,ఏ రకమైన మెడిసిన్ పెడతారని , ఒకవేళ ఆ ట్రీట్మెంట్ వల్ల పేషెంట్ చనిపోతే బాధ్యత ఎవరిదని ప్రశ్నించే క్రమం లో అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ వ్యక్తి నరేష్ తో వాగ్వివాదానికి దిగి దురుసుగా ప్రవర్తిస్తూ, ఇక్కడ ప్రశ్నించకూడదంటూ దబాయిస్తూ పై పైకి రాగా భయపడిన నరేష్ వెంటనే 100 కి డయల్ చేసి పోలీసులను పిలిపించగా వచ్చిన పోలీసులు గొడవ సద్దుమనిగేలా చేసి ,నరేష్ ను జరిగిన సంఘటన పై పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలంటూ సూచించి వెళ్లిపోయారు. విషయం గ్రహించిన నరేష్ ప్రాథమికంగా సివిల్ ఆస్పత్రి సూపరిండెంట్ కు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేద్దామని సూపరిండెంట్ ఉండే కార్యాలయానికి వెళ్ళగా అక్కడ సూపరిండెంట్ లేకపోవడంతో చరవాని ద్వారా సంప్రదించి ,జరిగిన సంఘటనను సూపరిండెంట్ కు వివరించగా తప్పు చేసిన వారిపై క్రమశిక్షణ రాహిత్య చర్యలు తీసుకుంటానని తెలిపినట్టు సమాచారం. ప్రశ్నిస్తే పరేషానే ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల క్రితం డ్యూటీలు వదిలేసి కొంతమంది ఆసుపత్రి సిబ్బంది ఓ పార్టీలో చిందులేస్తున్న విషయాన్ని ఓ విలేఖరి తెరకెక్కించి వైరల్ చేయడంతో అక్కసు పెట్టుకున్న కొంతమంది మహిళా సిబ్బంది అతనిపై అక్రమంగా అట్రాసిటీ కేసు నమోదు చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా వారి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆసుపత్రికి వచ్చే సామాన్యులను బలి చేయడంతో అరకొరగా ఉన్న సివిల్ ఆస్పత్రి పేరు మరింత బదనాం అవడంతోపాటు ప్రభుత్వం పేరు కూడా చెడిపోతుందని విషయం తెలిసిన పుర ప్రముఖులు విద్యావంతులు అనుకుంటున్నారు. ఇకనైనా సివిల్ ఆస్పత్రిలో వైద్య సేవలు జిల్లా ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా మెరుగైన వైద్యం అందేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు.

Related Articles

Back to top button