రాజీపడని పోరాటయోధుడు సీతారాం ఏచూరి
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు
viswatelangana.com
నమ్మిన సిద్ధాంతం కోసం ఆజన్మాంతం పోరాటం చేసిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరి అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీసీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. ఇటీవల మరణించిన సి.పి.ఐ.(ఎం) అఖిలభారత కమిటీ ప్రధాన కార్యదర్శి మార్క్సిస్టు మేధావి సీతారాం ఏచూరి సంస్మరణ సభ నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ.. మార్క్సిస్టు మేధావి అనుక్షణం పేద ప్రజల కోసం పోరాడిన గొప్ప నాయకుడని నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత పెద్దవారినైనా ఎదిరించిన వ్యక్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు. అలాంటి వ్యక్తి మరణించడం భారత వామపక్ష రాజకీయాలకు తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, కమ్యూనిస్టు పార్టీ నాయకులు చెన్న విశ్వనాథం, రాస భూమయ్య, సుతారి రాములు, పేట భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.



