ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లి లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

viswatelangana.com
ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లి యందు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ఆర్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన ” కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి”కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ ఆర్. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబర్ 27వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో జన్మించారని, ఆయన నాటి నైజాం రాజుకు వ్యతిరేకంగా, 1969 మలి దశ ఉద్యమంలో పాల్గొని ఉస్మానియా విద్యార్థుల ఉద్యమ పోరాట స్ఫూర్తి కి మద్దతు తెలుపుతూ తన పదవికి రాజీనామా చేసిన వ్యక్తి అని, తన నివాసమైన జలదృశ్యాన్ని తెలంగాణ రాష్ట్ర సమితికి అప్పజెప్పి అద్దె ఇంట్లో గడిపిన మహనీయుడని అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి గోవిందుల వెంకటేష్ అధ్యాపకులు సి హెచ్. శ్రీనివాస్. జగపతి,శ్రీనివాస్, మహేశ్వరి, నర్సయ్య రాజేశ్వరరావు, సుదర్శన్, ప్రతిభ మంజుల, స్వర్ణలత, జమున, నవీన్ కుమార్, జాకీర్, నాగేశ్వర్, జ్ఞానేశ్వర్, ఫాతిమా మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు



