రాయికల్

రైతులు పంట రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

viswatelangana.com

September 30th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

అల్లిపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని రైతులు సంఘం ద్వారా అందించే పంట రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సంఘ అధ్యక్షులు రాజలింగం తెలిపారు. సోమవారం రోజున సంఘ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులు మాట్లాడుతూ రుణమాఫీలో భాగంగా 167 మందికి గాను 14260000 వేల 218 రూపాయలు మాఫీ రాగా, 142 మందికి గాను 15485000 వేల పంట రుణాలు అందించామని, కొత్తగా 23 మంది రైతులకు గాను 2230000 వేల పంట రుణాలు అందించినట్టు, కర్షక మిత్ర పథకం ద్వారా రైతులకు ఒక కోటి రూపాయలు దీర్ఘకాలిక రుణాలు అందించినట్టు సంఘంలో సభ్యులకు డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటును వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మహదేవయ్య, పాలకవర్గ సభ్యులు రామ్ రెడ్డి, రాజారెడ్డి, గంగాధర్, చంద్రకళ, గంగు, బక్కయ్య, సంఘ కార్యదర్శి ఉపేందర్, సిబ్బంది సురేష్ గంగాధర్ రైతులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button