కోరుట్ల
సఫాయి మిత్ర సురక్ష సివిర్

viswatelangana.com
September 30th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవా సఫాయిమిత్ర సురక్ష సివిర్ లో భాగంగా పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు వచ్చే పిఎఫ్, ఇఎస్ఐ, ఇన్సూరెన్స్ స్కీంల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, మెడికల్ ఆఫీసర్, హెల్త్ సూపెర్వైసర్ ధనుంజయ్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్, ఇతర ఆరోగ్య సిబ్బంది అలాగే మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.



