కోరుట్ల

కోరుట్లతో పాటు జిల్లాలో హైడ్రా అమలు చేయాలని కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి కి ధన్యవాదాలు

ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్

viswatelangana.com

September 30th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జలాశయాలు, చెరువులు, కుంటలు అక్రమించుకొని ఎఫ్టిఎల్ మరియు బఫార్ జోన్లలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఆక్రమ నిర్మాణాల వల్ల పర్యావరణానికి నీటి నిల్వలకు విఘాతం ఏర్పడుతూ నీటి ప్రవాహానికి అటంకాలు కలగడమే కాకుండా దిగువ ప్రాంతాలు ముంపుకు గురి అవుతూ జన జీవనానికి ప్రమాదాలు సంభవిస్తున్న పరిస్థితులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన హైడ్రా చట్టాన్ని కోరుట్లతో పాటు జిల్లాలో అమలు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ను మరియు సంబంధిత శాఖల అధికారులకు లేఖల ద్వారా కోరిన పట్టబద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డికి తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్, కోరుట్ల డెవలప్మెంట్ ఫోరమ్ అధ్యక్షులు చెన్న విశ్వనాథం లు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం కోరుట్ల సి ప్రభాకర్ స్మారక గ్రంథాలయ ఆవరణలో కోరుట్ల డెవలప్మెంట్ ఫోరమ్ అధ్యక్షులు చెన్న విశ్వనాథం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ధన్యవాదాలు తీర్మానం చేసి తను పంపిన లేఖలను కోరుట్ల తహశీల్దార్ ఇట్యాల కిషన్, ఆర్డీవో డిఎఒ రాజమణి, ఇరిగేషన్ ఇఇ వెంకటేశ్వర్లకు అందించారు. ఈ సందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ చెరువులు, కుంటలు, గొలుసు కట్టు కాలువలను రక్షించాలని శనివారం ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ లను కలిసి విజ్ఞప్తి చేసినందుకు స్పందించిన పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, కోరుట్ల ఆర్డీవో, తహశీల్దార్, ఇరిగేషన్ ఇ ఇ మెట్ పెల్లి, కోరుట్ల పట్టణంలోని తాళ్లచెరువు, మద్దెలచెరువు, కంచెరకుంట ఎఫ్ టి ఎల్ మరియు బఫార్ జోన్లు, నీటి ప్రవాహ కాలువల పరిధిలో ఆక్రమ నిర్మాణాల చేస్తు మట్టి నింపడం వల్ల భూగర్భజలాలు అడుగంటుతున్నయాని ప్రజలకు, రైతులకు ముఖ్యంగా చేపల వృత్తి పై ఆదారపడి జీవిస్తున్న మత్స్యకారులు తీవ్రంగా నష్ట పోతారని, అందుకే హైడ్రా అమలు చేయాలని ఎఫ్ టి ఎల్, బఫార్ జోన్లు గుర్తించి ఆక్రమణలు తొలిగించాలని లేఖలో అధికారులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరినట్లు పేట భాస్కర్ తెలిపారు. ఇక నైనా ప్రజలు అప్రమత్తంగా వుండాలని భూములు కోనుగోలు చేసేటప్పుడు అవి ఎలాంటి భూములో తెలుసుకోవాలని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల్లో స్థిరపడెందుకు అంతో ఇంతో డబ్బులు కూడ బెట్టుకొని కొందరు, స్థిర ఆస్తులు అమ్ముకొని కోనుగోలు చేసేవారు కొందరు రియల్టర్లు చేప్పె మాయమాటలను నమ్మి మోసపోతున్నారని అలాంటి వారిని ప్రభుత్వం అదుకోవాలని పేట భాస్కర్ కోరారు. ఈ సమావేశంలో ఫోరమ్ నాయకులు రామిల్ల రాంబాబు, ఆలీ నవాబ్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు జుంబర్తి రమేష్, ఎన్ఎచ్ఎఫ్ అధ్యక్షులు షాహిద్ మహ్మద్ షేక్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ఇల్లుటపు గంగానర్సయ్య, కూనరపు దర్మేష్, దేశవేని రవి, లక్ష్మీ నారాయణ, హన్మంతు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button