కోరుట్ల

కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో

చైర్మన్ పన్నాల అంజిరెడ్డి విలేకరుల సమావేశం

viswatelangana.com

October 1st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు అలాగే పీసీసీ నాయకులు జువ్వాడి కృష్ణా రావు ఆదేశాల మేరకు కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం లో చైర్మన్ పన్నాల అంజిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అర్హులైన ప్రతీ రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి దక్కిందన్నారు. సాంకేతిక కారణాల వలన రుణమాఫీ కాని 5 లక్షల రైతుల వివరాలు ప్రభుత్వం సేకరించి, నాలుగవ విడతలో భాగంగా త్వరలోనే వారికి ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని అన్నారు. నిరంతరం రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌ పార్టీపై బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేసి రైతులని పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతుల గురించి ఏనాడూ ఆలోచించని తెరాస, బీజేపీ నాయకులు ఇప్పుడు ధర్నాలు చేయడం విడ్డురంగా ఉందన్నారు, వరి వేస్తే ఉరే అన్న కెసిఆర్ మాటల్లోనే రైతుల మీద ఉన్న కపట ప్రేమ తెలిసిందన్నారు. రైతు నల్ల చట్టాలపై ధర్నా చేసిన రైతులను కార్లతో గుద్ది చంపిన ఘనత బీజేపీ పార్టీది అని అన్నారు. రైతును రాజుగా చేయడం కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యం అని అందుకు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న కృషి అభినంద నీయమని కొనియాడారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో పంటించిన సన్న వడ్లకు 5 వందల రూపాయల బోనస్‌ చెల్లిస్తుందన్నారు. రైతు భరోసా పథకం విధివిధానాలు రూపొందిస్తున్నారు అని త్వరలోనే అర్హులైన రైతుల ఖాతాలో నగదు జమచేస్తుందని అన్నారు. అర్హులైన వారందరికీ తెల్లరేషన్‌ కార్డులు, హెల్త్‌కార్డులు అందిస్తామన్నారు. అతిత్వరలో ఇల్లులేని వారందరికీ ఇందిరమ ఇల్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పుల్లూరి వెంకటేష్ గౌడ్, సభ్యులు దూడ బాపు రెడ్డి, అల్లాడి శ్రీనివాస్ అలాగే మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సైదు గంగాధర్, నాయకులు పల్లపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button