హైదరాబాద్

హోంగార్డు గోపాల్ మరణించినట్టుగా తప్పుడు ప్రచారం

మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఎఐజి హాస్పిటల్ లో చికిత్స

viswatelangana.com

October 1st, 2024
హైదరాబాద్ (విశ్వతెలంగాణ) :

సంగారెడ్డి జిల్లా రుద్ర కరణ్ పోలీస్ స్టేషన్లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ హెచ్ జి 440 తాండ్ర గోపాల్ 2024 సెప్టెంబర్ 26 శనివారం మల్కాపూర్ చెరువులో అక్రమ భవన నిర్మాణాన్ని కూల్చివేత క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు భవనం పేల్చివేయడంతో రాయి వేగంతో తన తలకు తాకి తీవ్ర గాయాలు అయ్యాయని, జిల్లా ఎస్పీ ఆదేశాలతో మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఎఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై పలు సోషల్ మీడియా మాధ్యమాలలో హోంగార్డు గోపాల్ మరణించినట్టుగా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నవి దీనిని మేము ఖండిస్తున్నామన్నా రాష్ట్ర హోంగార్డుల సంక్షేమ సంఘం, ఈ ప్రచారాల వల్ల ఆ కుటుంబం మరింత బాధపడుతుంది దయచేసి ఎవరు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా అసత్యాలను ప్రచారం చేయకూడదని విజ్ఞప్తి చేసారు. అదేవిధంగా ఆ కుటుంబానికి అండగా ఉండి చికిత్స చేపిస్తున్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ కి, ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐ కృతజ్ఞతలు తెలిపారు. గోపాల్ పూర్తిస్థాయిలో కోలుకొని మల్లి విధులు నిర్వహించే వరకు ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలబడాలి వారికి కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర హోంగార్డుల ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకొని ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత సౌకర్యం కల్పించాలి రాబోవు దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని సకాలంలో వేతనాలు అందించాలి పెండింగ్ లో ఉన్న ఐదు సంవత్సరాల యూనిఫామ్ అలవెన్స్ విడుదల చేయాలి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోంగార్డులకు దసరా పండుగ కానుకగా తీపి కబురు అందించాలని ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర హోంగార్డుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పుప్పాల అశోక్ విజ్ఞప్తి చేసారు.

Related Articles

Check Also
Close
Back to top button