
viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన నేతుల మల్లేశం (35) అనే యువకుడు అదృశ్యమైనట్లు కథలాపూర్ ఎస్సై నవీన్ కుమార్ బుధవారం రాత్రి తెలిపారు. మల్లేశం బైక్ ఎస్సారెస్పి కెనాల్ దుంపేట శివారులో లభ్యమైంది. ఘటన స్థలాన్ని మెట్ పల్లి డీ ఎస్పీ ఉమా మహేశ్వర్ రావు, కోరుట్ల సీఐ సురేష్ బాబులు పరిశీలించారు. మల్లేశం సోదరుడు రాజమల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సుపారీ గ్యాంగ్ ఆడియో కలకలం మల్లేశం అదృశ్యం పై పోలీసులు పలువురి వివరాలు సేకరిస్తుండగా జగిత్యాల కు చెందిన సుపారీ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు ఆడియో బయటకు వచ్చింది.జగిత్యాల కు చెందిన వ్యక్తులకు డబ్బులు ఇచ్చి చింతకుంట కు చెందిన ఇద్దరు వ్యక్తులను హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆడియోలో ఉంది. దీంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.



