కథలాపూర్
పాము కాటుతో మహిళ రైతు కూలీ మృతి

viswatelangana.com
October 4th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో పాముకాటుకు గురై ఓ మహిళా రైతు కూలీ మృతి చెందింది.గ్రామానికి చెందిన పత్రీ లక్ష్మి(30) అనే మహిళ రైతు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. రోజువారీలాగే గురువారం వ్యవసాయ పనులకు మక్క చేను కోత పనికి వెళ్లింది. ఈ క్రమంలోనే చేను కోస్తుండగా.. లక్ష్మిని పాము కాటు వేసింది. వెంటనే తోటి కూలీలు ఆమెను కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. లక్ష్మికి భర్త, కుమారుడు, కూతురు ఉన్నారు. లక్ష్మి మృతి పట్ల గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిరుపేదరాలైన లక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.



