6 న సన్మాన కార్యక్రమం – మైనార్టీ హక్కుల అవగాహన సదస్సు

viswatelangana.com
అక్టోబర్ ఆరవ తేదీన సన్మాన కార్యక్రమం మరియు మైనార్టీ హక్కుల పై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ తాజుద్దీన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముజాహిద్ లు తెలిపారు. విలేకరులతో వారు మాట్లాడుతూ మైనార్టీ హక్కులు సంక్షేమం తదితర అంశాలపై అవగాహన కోసం ఈ సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్. ఉభేదుల్లా కొత్వాల్. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్. సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని. తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్. తాహర్బిన్ హంధాన్ తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్. డాక్టర్ రియాజ్. తెలంగాణ గ్రంథాలయ చైర్మన్. లు విశిష్ట అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కోరుట్లలోని ఐలాపూర్ రోడ్ సీఎంసీ గార్డెన్లో ఆరవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని ప్రజలను కోరారు ఈ సమావేశంలో జమాతే ఇస్లాం పట్టణ అధ్యక్షులు ఇలియాస్ ఖాన్, సీనియర్ పాత్రికేయులు సలింపారుకి మహమ్మద్ మాసిఉద్దిన్ అబ్దుల్ కయ్యుమ్ అదనాన్ షకీల్ తదితరులు పాల్గొన్నారు.



