కోరుట్ల
ఏ జి పి ని సన్మానించిన జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com
October 7th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల న్యాయస్థానంలో ప్రభుత్వ సహాయ న్యాయవాది( ఏ జి పి) గా నియమితులైన గోనె రాజేష్ ఖన్నాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఘనంగా సన్మానించారు. పట్టణంలోని కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో జరిగిన కార్యక్రమంలో అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు గంగుల రాంగోపాల్, కస్తూరి రమేష్, తోట ఆంజనేయులు, తోకల రమేష్, ఆడెపు వినోద్, పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మచ్చ కవిత తదితరులు పాల్గొన్నారు.



