కథలాపూర్
దుర్గా మాత మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం

viswatelangana.com
October 7th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు మహా చండి దేవి అవతారంలో దర్శమించిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో బాగుండాలని మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.దుర్గామాత రోజుకో అవతారంలో దర్శనం ఇస్తుండడంతో దానికి అనుగుణంగా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు ప్రతీ రోజు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరిస్తూ తమ భక్తిని చాటి కుంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు



