ఇటీవల మరణించిన పత్రి లక్ష్మీ పిల్లలకు 5,000 ఆర్థిక సహాయం చేసిన రుద్ర రచన

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన పత్రి లక్ష్మి రెక్కడితే గాని డొక్కాడని కుటుంబం వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న సమయంలో ఇటీవల పాము కాటుకు గురై మరణించింది దానితో పిల్లలు ఇద్దరు తల్లి లేని ఆనాధలు అయ్యారు వారి దీన స్థితిని తెలుసుకుని లక్ష్మి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి సహాయం తో పాటు పండుగ పూట కొత్త బట్టలు కొనుక్కోలేని పరిస్థితిని తెలుసుకుని వారికి మరియు ఇతర అనాధ పిల్లలకి కూడా కొత్త బట్టలు కొని ఇవ్వడం జరిగింది అలాగే భవిష్యత్లో తన చదువుకు కూడా సహాయం చేస్తానని చెప్పింది.రుద్ర రచన మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని బాధ ఎలా ఉంటుందో తెలుసు అని తాను కూడా ఇదే చాలా దారుణమైన పరిస్థితులు అనుభవించానని తెలియజేసింది.అలాగే ప్రభుత్వాలు కూడా ఇటువంటి అనాధలను గుర్తించి అనాధ పిల్లలకు కూడా చదువుల్లో మరియు ఉద్యోగంలో రిజర్వేషన్లు కల్పించాలని అలాగే అనాధలను తల్లి తండ్రిగా అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంది. అలాగే ఒక అనాధ విద్యార్ధికి చదువుకోవడానికి ఆర్థిక సహాయంతో పాటు లాప్టాప్ కూడా ఇచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలు యువకులు రుద్ర రచనను అభినందించడం జరిగింది



