ఎస్సీ వర్గీకరణ అమలు కావాలని జాంబవంతున్ని దర్శించుకున్న
టిఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య

viswatelangana.com
మూడు దశాబ్దాలుగా ఏబిసిడి వర్గీకరణ కొరకు అలుపు ఎరగని పోరాటం చేస్తున్న మాదిగ సోదరులకు అలాగే ఉపకులాల అందరికి న్యాయం జరిగేలా సుప్రీంకోర్టు ఇటీవలే ఒక చరిత్రత్మకమైన తీర్పును ప్రకటించిన సందర్భంలో కొందరు రాష్ట్రంలో కావాలనే దురుద్దేశంతో కొన్ని అడ్డంకులు అవరోధాలు ఏర్పరుస్తున్నారని, అలాంటి వారికి లొంగకుండా సామాజిక న్యాయం ఎస్సీ 59 కులాల్లో ఉన్న ప్రతి కులానికి జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగాలన్నది మా అభిమతమని ఎవరినో ఒక వర్గాన్ని కించపరచడం ఒక వర్గాన్ని మెచ్చుకోవడం కాదని గుర్తుంచుకోవాలన్నారు. దయచేసి ఇప్పటికైనా ఎస్సీల్లో ఉన్న మనం సహృదయంతో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండవలసిన అవసరం ఉందని, ఇప్పటికే చాలామంది వారి వారి అంగీకారాన్ని పత్రికా ముఖంగా అన్ని మీడియాలో ఆహ్వానించదగ్గ విషయం అని చెప్పి మళ్లీ ఎదురు తిరగడం సమంజసం కాదని కల్లూరు మాజీ సర్పంచ్ తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనతడుపుల అంజయ్య ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు. ఇదే విషయమై తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక ఆది జాంబవుని ఆలయం నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని కొలనుపాకలోని ఆదిజాంబవ ఆలయాన్ని సందర్శించి విజ్ఞాలన్ని తొలగించాలని కోరుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రామ్ లక్ష్మణ్, గంగాధర నరేష్, కూసనపల్లి రవి, తదితరులు ఉన్నారు.



