కోరుట్ల
ఆల్ ఇండియా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సాంఘిక సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షరాలిగా నాగ నిర్మల, మహిళా అధ్యక్షురాలిగా శ్రావణి

viswatelangana.com
October 18th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
ఆల్ ఇండియా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సాంఘిక సంక్షేమ సంఘం న్యూఢిల్లి, కీర్తిశేషులు జ్యోతిరావు పూలే, డా,, బాబా సాహెబ్ అంబెడ్కర్, కొమరం బీమ్ డా,,అబ్దుల్ కలామ్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సేవ చేస్తారని భావిస్తూ ఆల్ ఇండియా తెలంగాణ స్టేట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టి సాంఘిక సంక్షేమ సంఘ తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణానికి చెందిన సిహెచ్ నాగ నిర్మల జగిత్యాల జిల్లా అధ్యక్షరాలిగా అలాగే టి.శ్రావణి జగిత్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలిగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొత్త విజయ భాస్కర్ నియామక పత్రాలని అందజేస్తూ పత్రికా ముఖంగా ప్రకటించారు.



