జగిత్యాల
జగిత్యాల నుంచి ముంబైకి రైలు

viswatelangana.com
October 20th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా లింగంపేటలోని రైల్వే స్టేషన్ నుంచి ముంబై దాదర్ వరకు ప్రతి బుధవారం సాయంత్రం 05:40 నిమిషాలకు రైలును తిరిగి పునః ప్రారంభించారు. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1:25 గంటలకు దాదర్ చేరుకోనుంది. కాగా ఇదే రైలు తిరిగి గురువారం ముంబై (దాదర్) నుంచి మధ్యాహ్నం 3:25 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 11 గంటల వరకు జగిత్యాలకు రానుంది.



