కథలాపూర్
అనుమతుల్లేని చర్చిలపై తగు చర్యలు తీసుకోవాలని వినతి

viswatelangana.com
October 25th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామ శివారులోని కుమ్మరి పల్లి సరిహద్దు ప్రాంతంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద, గ్రామంలోని బుడగ జంగాల కాలనీ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా చర్చి నిర్మాణం, గుడిసె వేసి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ, అన్యమత ప్రచారం చేస్తూ, మతమార్పిడులకు పాల్పడుతున్నారని అనుమతుల్లేని చర్చిలపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శి వేణు కు శుక్రవారం గ్రామస్తులు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ రాజనాల మధు కుమార్, సద్ది మహిపాల్, దేశ వేణి శ్రీనివాస్, మోత్కూరి శ్రీనివాస్ గౌడ్, స్వామి, వినీత్, మధు తదితరులు పాల్గొన్నారు.



