ఘనంగా శ్రీకాంతాచారి వర్ధంతి

viswatelangana.com
తెలంగాణ మలిదశ పోరాటంలో తొలి అమరుడు నల్గొండ జిల్లాకు చెందిన విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ, కాసోజు శ్రీకాంతచారి.ఆయన ఆత్మబలి దానం తర్వాతే తెలంగాణ ఉద్యమం మరింత ఊపందుకుంది. మంగళ వారం రోజున కాసోజు శ్రీకాంత చారి వర్ధంతి ని పురస్కరించుకొని, ఘనంగా నివాళులు అర్పించారు.తెలంగాణ ఏర్పాటు చేసుకున్న తరువాత అతని స్మరిస్తూ, అమరుడైన శ్రీకాంతాచారిని విశ్వబ్రాహ్మణ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమములో జగిత్యాల జిల్లా సేవాదళ్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బెజ్జారపు భూమాచారి,మెట్ పల్లి మండల్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఇల్లేందుల రాజు, మెట్ పల్లి టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బెజ్జారపు శ్రీనివాస్, తుమ్మనపల్లి రాజేందప్రసాద్,తాడూరి రంగయ్య, శ్రీపాద లింబాద్రి, సహకార సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పొలాస శేఖర్, ఇంద్రాల మల్లేశం, బెజ్జారపు గంగాధర్, కత్తిరాజ్ శంకర్, శ్రీ గద్దె శేఖర్, గోగులకొండ జగదీష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.



