కథలపూర్ మండల ఏ ఎం సి వైస్ చైర్ పర్సన్ పులి శిరీషను ఘనంగా సన్మానం

viswatelangana.com
కథలాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన పులి శిరీష హరి ప్రసాద్ ను కథలాపూర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్ పర్సన్ గా నియమితులైన సందర్భంగా పోతారం జడ్పీ హైస్కూల్లో శుక్రవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పులి శిరీష- హరి ప్రసాద్ గతంలో పోతారం ఎంపిటిసిగా ఎన్నికై గ్రామంతో పాటు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఉపాధ్యాయులు విద్యార్థులు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేసిన శిరీష హరి ప్రసాద్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్ పర్సన్ గా నియమితులు కావడంతో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఉపాధ్యాయులు విద్యార్థులు ఆకాంక్షించారు. జెడ్పీ హైస్కూల్ ఆవరణలో పులి శిరీష హరి ప్రసాద్ కు శాలువాలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పులి శిరీష -హరి ప్రసాద్ మాట్లాడుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో గ్రామాన్ని, ప్రభుత్వ పాఠశాలలను, మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరహరి, నాయకులు, విద్యార్థులు అధిక సంఖ్యను పాల్గొన్నారు.



