రాయికల్
మూతపడిన అంగన్వాడి సెంటర్

viswatelangana.com
December 10th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మంత్యా నాయక్ తండ గ్రామపంచాయతీ లోక్య నాయక్ తండాలో గత 20 రోజులుగా అంగన్వాడి కేంద్రం టీచర్ లేక కొనసాగుతుంది. దీనిని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి టీచర్ ఉన్నారా లేరా ఒకవేళ ఉన్నట్లయితే వెంటనే పంపించగలరని, లేనట్లయితే వెంటనే భర్తీ చేయగలరని తండావాసులు కోరుతున్నారు. ఓవైపు మా కంటే మాకు ఇవ్వాలని అనేకమంది పైరవీలు చేస్తున్నారని. ఈ సందర్భంలో ప్రజా గాయకుడు రచయిత గంగాధర్ నాయక్ మాట్లాడుతూ దీనిని వెంటనే పరిష్కరించాలని, సంబంధిత అధికారులు స్పందించాలని అన్నారు.



