బాలమేధ లో ప్రథమ బహుమతి గెలుపొందిన ఎంపిపిఎస్ బొమ్మెన విద్యార్థులు

viswatelangana.com
కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిరికొండ కాంప్లెక్స్ పరిధిలో, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సిరికొండ వేదికగా నిర్వహించిన బాల మేధ (క్విజ్ )లో ప్రథమ బహుమతిగా ఎంపిపిఎస్ బొమ్మెన విద్యార్థులు, ద్వితీయ బహుమతిగా ఎంపిపిఎస్ (బీసీ) బొమ్మెన విద్యార్థులు, తృతీయ బహుమతిగా ఎంపిపిఎస్ సిరికొండ విద్యార్థులు గెలుపొందారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎంఈఓ లోకిని శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం మరియు ఎంఈఓ లోకిని శ్రీనివాస్, సిరికొండ ప్రధానోపాధ్యాయురాలు వసంత, బొమ్మెన ఉపాధ్యాయులు సాయిరెడ్డి, తక్కళ్లపెల్లి ఉపాధ్యాయులు మహేష్, క్విజ్ మాస్టర్ యాదగిరి, కాంప్లెక్స్ అబ్సర్వర్ దుర్గా ప్రసాద్, సూర్నేని మహేందర్ రావు, చౌడారపు విష్ణు,ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.



