రాయికల్

అంగన్వాడి లో సీమంతాలు అన్నప్రాసన అక్షరాభ్యాసం

viswatelangana.com

December 20th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల ప్రాజెక్టు రాయికల్ మండలంలోని వడ్డలింగాపూర్ అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ శ్రీమంతాలు, ఏడు నెలలు నిండిన పాపకి అన్నప్రాసన, అంగన్వాడి కేంద్రంలో రెండు సంవత్సరాల ఐదు నెలల పిల్లలకి అక్షరాభ్యాసం చేసిన సందర్భంగా మమతా మాట్లాడుతూ గర్భిణీ నుండి ఆరు సంవత్సరాల పిల్లల వరకు, కిషోర్ బాలికలు మరియు వయోవృద్ధులు, దివ్యాంగులు వారికి అందించే సేవలు అంగన్వాడి నుండి పొందే సేవలో ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని,కాలానికి అనుగుణంగా దొరికే పండ్లు తీసుకుంటూ మరియు జాగ్రత్తలు తీసుకోవాలని, సీజనల్ వారీగా వచ్చే మలేరియా, డెంగ్యూ జ్వరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ,శుభ్రతలు పాటించాలని,ప్రతి ఒక్కరూ ఆకుకూరలు ఆకు పచ్చ రంగులో కల కాయగూరలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలని, అయోడిన్ ఉప్పుని వాడాలని, బెల్లంతో ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలని, ప్రతి ఒక్క గర్భిణీ నాలుగుసార్లు హాస్పటల్ చెకప్ లు చేయించుకోవాలని,రెండు సంవత్సరాల ఆరు నెలలు నిండిన ప్రతి పిల్లలని అంగన్వాడి కేంద్రంలోనే చేర్పించాలని, ప్రవేట్ స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీలోనే పిల్లలకి విద్యాబోధన అందిస్తున్నాము. ఆటపాటలతో పిల్లల మెదడుకు భారం లేకుండా సులువుగా విద్యను అభ్యసించడం ప్రతి పిల్లలు అభివృద్ధికై అంగన్వాడీ తోడ్పడుతుందని తెలియజేసినారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీలు కావాలని, ప్రభుత్వం ఇచ్చేప్రతి ఒక సేవను అందుకోవాలని తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ కస్తూరి, డాక్టర్ సతీష్ కుమార్, స్కూల్ హెడ్మాస్టర్ భాగ్యశ్రీ, గురుకులం పాఠశాల కవిత, సిడిపిఓ మమతా, సూపర్వైజర్ పద్మావతి, అంగన్వాడీ టీచర్ గంగాజల గర్భిణీలు బాలింతలు ప్రీస్కూల్ పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button