జగిత్యాల
దివ్యాంగురాలి చేత జెండా ఎగరవేతదివ్యాంగులు మానవాళికి ఆదర్శం

viswatelangana.com
January 26th, 2025
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
స్థానిక జగిత్యాల పట్టణంలో కృష్ణానగర్ 37 వార్డులో ఆడెపు సత్యనారాయణ వార్డులో గల యువతను, ప్రముఖులను, పలు రాజకీయ నాయకులను సమీకరించి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఓ దివ్యాంగురాలిచే మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అడెపు సత్యనారాయణ మాట్లాడుతూ దివ్యాంగులు చాలా రంగాలలో పట్టుదలతో కృషితో చాలా ముందంజలో ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకొని ప్రజలు జీవితంలో ఎదగడంతోపాటు దేశ అభివృద్ధికి ,దేశ ఔన్నత్యానికి పాటుపడాలని సూచించారు. కరోనా తర్వాత ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశం పలు రంగాలలో అభివృద్ధి సాధించి ముందుకు సాగుతుందని తెలిపారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వార్డు పెద్దలు, ప్రముఖులు, యువత, మాజీ కౌన్సిలర్ భోగ వెంకటేశ్వర్లు, అనీల్, విజయ్, బాలాజీ, రఫీ, సాయి వరుణ్ తదితరులు పాల్గొన్నారు.



