ప్రతిభ కనబరిచిన లైన్ ఇన్స్పెక్టర్ కు సన్మానం

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని వడ్డేలింగాపూర్ సబ్ స్టేషన్ సెక్షన్ పరిధిలో విద్యుత్తు లైన్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గన్నె మల్లారెడ్డి వీధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో పాటు ఇటిక్యాల, వడ్డే లింగాపూర్, వీరాపూర్, తాట్లవాయి సబ్ స్టేషన్ లలోని ఖాళీ స్థలాల్లో తనే స్వయంగా మొక్కలు కొనుగోలు చేసి నాటి సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు నాంది పలకడంతో పాటు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కాగా ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏఈ రాజేశం ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఎప్పటికీ గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, లైన్మెన్లు లక్ష్మణ్, రమణచారి అసిస్టెంట్ లైన్మెన్లు సంపత్, వినోద్, శ్రీనివాస్, తాత్కాలిక కార్మికులు తిరుపతి,రవి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



