రాయికల్
సీపీఎస్ రద్దు చేయాలని పీఆర్టియు వినతి

viswatelangana.com
January 27th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని కోరుతూ రాయికల్ తహసీల్దార్ ఎం ఏ ఖయ్యూం కు పిఆర్టియు ప్రతినిధులు సోమవారం వినతి పత్రం సమర్పించారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న యుపిఎస్ లో చేరవద్దని…. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిపెస్టో లో పెట్టినవిధంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు మేలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పొన్నం రమేష్, రాష్ట్ర కార్యదర్శిలు లక్కడి రాజారెడ్డి, అక్కనపెల్లి సతీష్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కన్నావేని మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి దొంతి సతీష్, మండల కార్యదర్శి సిలివేరి రమేష్, ఉపాధ్యాయులు తరంగిణి, గంగ జమున, తిరుమల వనిత,పద్మజ, అరిషియ రవీందర్, మల్లేశం, సత్యనారాయణ, నాగరాజు, సామల్ల గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి, పారి పెళ్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.



