ప్రభుత్వ కార్యాలయాల్లో సహచట్టం బోర్డులు ఏర్పాటు చేయాలి

viswatelangana.com
ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం 2005 బోర్డులు, అధికారులు నిర్వర్తించే బాధ్యతలు వారి ఫోన్ నెంబర్స్ ప్రజలకు కనపడే విధంగా ఏర్పాటు చేయాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ( పౌర మరియు మానవ హక్కుల సంస్థ ) మండల ఇన్చార్జ్ చెట్లపల్లి మహేష్ తెలిపారు. మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పౌర సమాచార అధికారికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంపొందించి ప్రభుత్వ పాలన విధివిధానాలను ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నారు. సహ చట్టం సూచిక బోర్డులు సరిగా లేనందున ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగులు ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు. అవినీతి రహిత అలసత్వం లేని సమాజం నిర్మించడమే సిసిఆర్ లక్ష్యం అని మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ తాలూకా మల్లేష్, కథలాపూర్ మండల ఇన్చార్జి చెట్లపల్లి మహేష్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, మహేష్, అలాగే సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు..



