జగిత్యాల

జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ ట్రైనింగ్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కలసి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

viswatelangana.com

January 29th, 2025
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

బుధవారం రోజున జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కలెక్టర్ గారు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్య్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 74 హాట్ స్పాట్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. యాక్సిడెంట్ అయిన తరువాత చాలా మంది భయపడతారని కానీ ఆ సమయంలో ధైర్యంతో ముందుకు వెళ్ళి ఒక ప్రాణం కాపాడితే వాళ్లు జీవితాంతం మిమ్మల్ని మర్చిపోరని తెలియజేశారు. మనిషి ప్రాణం చాలా విలువైనదని ఆపద సమయంలో ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ ట్రైనింగ్ తీసుకొని అత్యవసర సమయంలో ఉపయోగించుకోవాలని కార్యక్రమానికి వచ్చిన సోషల్ సర్వీస్ రెస్పాండ్ సభ్యులకు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ ఏర్పాటు చేసిన సిపిఆర్ బొమ్మపై స్వయంగా సిపిఆర్ చేశారు. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఎస్పీ కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డాక్టర్స్ , పోలీస్ అధికారులు, సోషల్ రెస్పాండ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button