కొడిమ్యాల
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ చిత్రానికి పాలాభిషేకం

viswatelangana.com
January 29th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం మంద కృష్ణ మాదగకి కి పద్మ శ్రీ అవార్డు పొందిన సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి అనేక సేవ కార్యక్రమాలు చేయడం, వికలాంగులకు పింఛన్ లు కల్పించడం, చిన్న పిల్లలకు గుండె జబ్బులకు శాస్త్ర చికిత్సలకు సంబదించిన ఆరోగ్య శ్రీ లాంటి రూపొదించడంలో ముఖ్య పాత్ర పోషించారని అలాగే ముందు ముందు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమం లో ఎమ్మార్వీఎస్ మండల అధ్యక్షులు మరియు బిజెపి మండల అధ్యక్షులు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.



