కోరుట్ల
సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ రికవరీ

viswatelangana.com
January 31st, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
ఇబ్రహింపట్నం మండలం, వర్షకొండ గ్రామానికి చెందిన తోకల శేఖర్ తండ్రి చిన్న రాజన్న అనునతను గత సెప్టెంబర్ నెలలో కోరుట్ల ఫోన్ పొగొట్టుకున్నాడు. ఈ మేరకు వెంటనే కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ రికవరీ చేసి శుక్రవారం ఏఎస్ఐ ఎండి. అలీముద్దిన్ బాధితుడికి ఫోన్ అందజేశారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్లో సంప్రదిస్తే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించవచ్చని ఏఎస్ఐ తెలిపారు.



