రాయికల్
విస్డం స్కూల్లో వైభవంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం

viswatelangana.com
February 3rd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
మాఘ శుద్ధ పంచమి సరస్వతీ మాత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక విస్డం హైస్కూల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు మరింగంటి రామకృష్ణమాచార్యులు విద్యార్థులందరిచే సరస్వతి మాత ప్రార్ధన, అష్టోత్తర శతనామాలు పలికిస్తూ ఉత్తమ విద్యా ప్రాప్తి కోసం సంకల్పం చేయించారు. ఓం శ్రీ సరస్వత్యై నమః అంటూ నూతన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం నుండి వచ్చిన పలక, లడ్డు ప్రసాదం, మంగళాక్షతలు విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నివేదితారెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



