కొడిమ్యాల
రైతు వేదిక పూడూర్ అడవి పందుల బెడద-పంటల రక్షణ

viswatelangana.com
February 4th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు రైతు వేదిక లో ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫారెన్స్ జరిగింది. అడవి పందుల బెడద- పంటల సంరక్షణ పద్ధతుల గురించి శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది. దీనిలో భాగంగా పంట చుట్టూ ముళ్ళ తీగ, పంది కొవ్వు పూసిన కొబ్బరి తాళ్ళు, వివిధ రకాల సౌండ్ పరికరాలు, సోలార్ ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్టైతే అడవి పందుల నుండిపంటనురక్షించుకోవచ్చు. సోలార్ ఫెన్సింగ్ మిరప లో తామర పురుగు లకి సంబంధించి ఇతర సందేహాలను శాస్త్రవేత్తలతో వెల్మల రామిరెడ్డి అడిగి తెలుసుకున్నారు. మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు తమకున్న సందేహాలను నేరుగా శాస్త్రవేత్తలతో అడిగి తెలుసుకునే అవకాశం కలదు.దీనిలో మండల వ్యవసాయ అధికారి పి.జ్యోతి, వ్యవసాయ విస్తరణ అధికారి రాజేష్ రైతులు పాల్గొన్నారు.



