కొడిమ్యాల
టియుడబ్ల్యూజే హెచ్143 మండల ప్రధాన కార్యదర్శి ఏకగ్రీవ ఎన్నిక

viswatelangana.com
February 16th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా ఆదివారం కొడిమ్యాల మండలం టీయూడబ్ల్యూజే హెచ్ 143 ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ రఫీ ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ ఆదేశాల మేరకు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బూర్ల రమేష్,గౌరవ అధ్యక్షుడు పైడిపల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్లగట్ట గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీని మండల ప్రెస్ క్లబ్ సభ్యులు శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్ బలోపేతానికి, జర్నలిస్టుల హక్కుల సాధనకు కృషి చేస్తామని తెలిపారు.



