ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపించాలని పట్టభద్రుల ఇంటింటా ప్రచారం

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని కొడిమ్యాల పిఎన్ఆర్ టీం పీఆర్వో రేకులపల్లీ సతీష్ రెడ్డి పట్టబద్దులకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆదివారం కొడిమ్యాల మండలంలోని పూ డూరు అప్పారావుపేట గ్రామంలో పట్టభద్రుల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పరిచయం అందరికీ తెలిసిన వ్యక్తి ఎంతో కష్టపడి ఎదిగిన ఆయన విద్యా రంగంలో అందించిన సేవలు మరువలేని అన్నారు అనేక విద్య సంస్థలు స్థాపించి పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడమే కాకుండా తమ సంస్థల్లో 5000 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు ఆల్ ఫోర్స్ ఉట్కూరి నరేందర్ రెడ్డి వేసి గెలిపించాలని కోరుతూ గ్రాడ్యుయేట్స్ ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీం విఎన్ఆర్ సభ్యులు శివ మనోజ్ సతీష్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు



