రాయికల్
పదవ తరగతి అంతర్గత మార్కుల పరిశీలన

viswatelangana.com
February 19th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని తాట్లవాయి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో బుధవారం ఇటిక్యాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్, మానిటరింగ్ టీం సభ్యులు చెరుకు మహేశ్వర శర్మ, వేముగంటి గిరిధర్ లు పదవ తరగతి అంతర్గత పరీక్షల,ఎఫ్.ఎ మార్కులను, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరి పై ఉందని అన్నారు. వార్షిక పరీక్షల్లో శతశాతం ఫలితాలు సాధించాలని ఆ దిశగా విద్యార్థులు ఇష్టపడి చదివి ధైర్యం తో భయం లేకుండా పరీక్షలు వ్రాయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు ఏనుగు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు రవీందర్, శ్రీధర్ జగన్, రాజేందర్, హరీష్, శ్రీదేవి, రాజేశం, సుజాత సి ఆర్ పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



