మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు ఘన నివాళులు

viswatelangana.com
కోరుట్ల పట్టణం జువ్వాడి భవన్ లో శనివారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణ రావు ఆయన సేవలను స్మరించుకు న్నారు. కృష్ణరావు మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా సేవలందిస్తూ దేశానికి అమూల్యమైన కృషి చేశారని, స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయన పాత్ర మౌలానా ఆజాద్ స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించారని, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకులతో కలిసి భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, ఎంఏ నయిం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఏలేటి మహిపాల్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మచ్చ కవిత, జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సోగ్రబి, జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు వసిం, మాజీ కౌన్సిలర్ ఖయ్యూమ్, నజిబొద్దిన్, రంజిత్ గుప్తా, తెడ్డు విజయ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు..



