కొడిమ్యాల
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం లో ఘనంగా భజన కార్యక్రమం

viswatelangana.com
March 1st, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారము రాత్రి పూజలు నిర్వహించి, ఘనంగా భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు నాగరాజు రమేష్, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి భజన బృందం, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆలయ నిర్మాణ కమిటి తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.



