కోరుట్ల

విజ్ఞాన యాత్రకు కోరుట్ల విద్యార్థులు

ప్రధానోపాధ్యాయులు నూనావత్ రాజు

viswatelangana.com

March 1st, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలో గల యస్ ఆర్ యస్ పి క్యాంప్ గడి ప్రాథమిక పాఠశాల కోరుట్ల విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు శనివారం విహార విజ్ఞాన యాత్రకు వెళ్ళారు. తెలంగాణ ప్రజల జీవనాధార ఆధారమైన పోచంపాడు నీటి ప్రాజెక్టు, జల విద్యుత్ కేంద్రంను సందర్శించి వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు జల విద్యుత్ సిబ్బంది వివరించారు. అలాగే ఆర్మూర్ సిద్ధులగుట్ట క్షేత్రాన్ని దర్శించి అక్కడ మునులు తపస్సు చేసిన దాని గురించి తెలుసుకున్నారు. పాల్గుట్ట రాములు మహారాజ్ క్షేత్రాన్ని, చదువుల తల్లి సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రం బాసర క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అలి సాగర్, జనకంపేట, సారంగాపూర్ టెంపుల్, నిజామాబాద్ ఖిల్లా తదితర క్షేత్రాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నూనావత్ రాజు, ఉపాధ్యాయులు పూర్ణ చందర్, సురేందర్, ధన లక్ష్మి, సుమలత, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button