వ్యర్ధాల నిర్వహణపై అధికారులకు అవగాహన

viswatelangana.com
కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టికే శ్రీదేవి ఆదేశాల మేరకు కోరుట్ల మున్సిపాలిటీలో ఘన వ్యర్ధాల నిర్వహణకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాంపోస్టింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ హేమలత రావడం జరిగింది. కంపోస్టిక్ సంబంధించిన నిర్వహణ ఏ విధంగా చేపట్టాలి దానికి సంబంధించిన సలహాలు సూచనలను అవగాహన కార్యక్రమానికి వివిధ మున్సిపాలిటీ నుంచి వచ్చిన మున్సిపల్ కమిషనర్లకు శానిటేషన్ విభాగానికి సంబంధించిన అధికారులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన వారు కంపోస్టింగ్ విధానం కోరుట్లలో ఏ విధంగా జరుగుతుంది స్వయంగా తెలుసుకోవడమే కాకుండా డి ఆర్ సి సి ని కూడా సందర్శించడం జరిగింది. అంతేకాకుండా డి ఆర్ సి సి నందు ఏ విధంగా రీసైక్లింగ్ పంపుతున్నారు అనే విషయాలను తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి అలాగే అవగాహన కార్యక్రమానికి హాజరైన వివిధ మున్సిపాలిటీలకు చెందిన మున్సిపల్ కమిషనర్లు, డిఈలు, ఏఈలు, సానిటరీ ఇన్స్పెక్టర్లు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు అలాగే ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.



