నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ స్టాండర్డ్స్ ఎన్ ఆర్ ఏ ఎస్ లో విజయం సాధించిన పూడూరు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని పూడూరు గ్రామంలో జనవరి 24న. ప్రారంభించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ కేంద్రాన్ని నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ స్టాండర్డ్స్ జాతీయ స్థాయి మహారాష్ట్ర తమిళనాడు బృందం వారు సందర్శించి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ జాతీయ స్థాయి విలువలకు లోబడి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని రిజిస్టర్స్ రికార్డులను పరిశీలించి సిబ్బంది అందరిని వారి అర్హతకు తగ్గట్టుగా ప్రశ్నలు అడిగి వారి నుండి సమాధానం తీసుకుని పూడూరు ఆరోగ్య కేంద్రాన్ని ఎం ఆర్ ఏ ఎస్ లో సెలెక్ట్ చేశారు. ఈ సమాచారాన్ని జాతీయ స్థాయి నుండి జగిత్యాల జిల్లా డిఎంహెచ్ఓ డా .ప్రమోద్ కుమార్ సార్ కి సమాచారం అందించారు. ఇట్టి సమాచారాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, కొడిమ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకి అందించారు. పూడూరు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రంలో ఎన్క్వాస్లో పనిచేసిన సిబ్బంది అందరికీ అభినందనలు తెలియజేశారు. అందరూ కలిసికట్టుగా పనిచేసే విజయం సాధించారని కొనియాడారు. ఇట్టి ఎంపికలో భాగస్వాములైన వారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఏ శ్రీనివాస్, ఎం సి హెచ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, మండల వైద్యాధికారులు డాక్టర్ పరమేశ్వరి, డాక్టర్ నరేష్, డా. సతీష్, డిపిఓ రవీందర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఈ రాజశేఖర్, ఎన్ ఆర్.ఎ స్ జిల్లా మేనేజర్ నాగరాజు, ఏ ఎం ఓ సత్యనారాయణ, హెచ్ ఈ ఓ అవారి శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ సత్యప్రసాద్, సూపర్వైజర్లు శ్రీనివాస్, మురళి, అలివేలు,ఎం ఎల్ హెచ్ పి లు, హెల్త్ అసిస్టెంట్స్, ఏఎన్ఎం లు, ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.



