కొడిమ్యాల
నర్సరీలో పెచ్చే మొక్కలు వర్షాకాలంలో నాటుటకు రావిప్ విద్యార్థులు నర్సరీ సందర్శన

viswatelangana.com
March 5th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని పూడూరు గ్రామంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా పెంచిన నర్సరీని, రావిప్ విద్యార్థినులు స్రవంతి, స్పందన, సోనీ, సత్య, జోష్ణ మాజీ సర్పంచ్ వెలుముల రామరెడ్డి సందర్శించారు. మొదట విద్యార్థినులు ఈనర్సరీలోని మొక్కలకు రోజ్ క్యాన్ తో నీళ్లు అందించడం జరిగింది. నర్సరీలో వచ్చే మొక్కలు వర్షాకాలంలో నాటుటకు జట్రోఫా, రైన్ ట్రీ, కానుగా, చింత, సీతాఫలం ఉసిరి, సిసో మొదలగు, పాదముడు వెయిల మొక్కలను పెంచి నాటుటకు అధికారులు నిర్ణయించడం జరిగింది నర్సరీ బాధ్యులు ఎంపీడీవో – స్వరూప, ఏపీవో – సతీష్, టెక్నికల్ అసిస్టెంట్ – గౌతమి, ఫీల్డ్ అసిస్టెంట్ – మహేందర్ రెడ్డి, నేతృత్వంలో ఇటీ మొక్కలు పెంచడం జరిగింది. వీటి రక్షణకై గ్రీన్ షేడ్ నెట్ పందిరి ఏర్పాట్లు చేశామని ఎంపీడీవో స్వరూప, తెలిపారు



