కోరుట్ల

దాము చేసిన సేవలు మరువలేనివని బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు

viswatelangana.com

March 7th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

మాజీ ఎమ్మెల్యే తుమ్మల వెంకటరమణ (దాము) చేసిన సేవలు మరువలేనివని బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు అన్నారు. శుక్రవారం ఆయన జయంతి పురస్కరించుకొని వారి స్వగృహంలో దాము ఫోటోకు పూలమాలవేసి జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. అనంతరం బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు మాట్లాడుతూ… ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రతి గ్రామంలో మంచినీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం, బస్సు సౌకర్యము కల్పించారాని అన్నారు. బాదన కుర్తి బ్రిడ్జి వారి కృషితోనే మంజూరు అయిందని, నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ధి మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు, నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, గుంటుక సదాశివ్, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ నెంబర్ ఇల్లెందుల కృష్ణమాచారి, గడ్డం రాజిరెడ్డి, అంబల్ల జగన్, ఆర్కే గణేష్, కొండేపు శ్రీనివాస్, కలాల రాజిరెడ్డి, సుతారి లింగారెడ్డి, తోకల సత్యనారాయణ, వేముల రవీందర్, శ్రీకర్ గౌడ్, గుంటుక రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button