మెట్ పల్లి పట్టణంలోని మార్కెట్ యార్డును సందర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

viswatelangana.com
పసుపుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే మద్దతు ధర ప్రకటించాలని రైతులు రేపు చేస్తున్న ధర్నాకు ప్రతిఒక్క రైతన్న పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరుతున్న.. రైతన్నలు కూడా… ఓట్ల కోసం రైతులను మోసం చేస్తూ పదవిలో ఉంటూ పబ్బం గడుపుతున్న నాయకులని నిలదీయాలి.. అంబాసిడర్ అని ఒక రోజు బెంజ్ కార్ అని ఇంకో రోజు రైతులను ఓట్ల కోసం వాడుకునే నాయకులని ప్రశ్నించాలి.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో…. వచ్చే సిజన్ లో పసుపు రైతులు కోటీశ్వరులు కాబోతున్నారు అని విచ్చల విడిగా అబద్ధాలు మాట్లాడిన నాయకులు ఇప్పుడు రైతులకు సమాధానం చెప్పాలి.. చివరగా మరోసారి వేడుకుంటున్న మొన్న జగిత్యాల వరకు మీకోసం నేను చేసిన పాదయాత్రకు మించి రేపటి రైతు ధర్నా వియవంతం కావాలని కోరుకుంటున్నాను.. బోర్డు పేరుతో కేంద్ర ప్రభుత్వం, 15,000 మద్దతు ధర అని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పార్టీలు ఓట్ల కోసం పసుపు రైతులను మోసం చేసాయని ఏమ్మెల్యే సంజయ్ ఆరోపించారు..



