విద్యార్థులు ఏకాగ్రతతో ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు
-ప్రధానోపాధ్యాయులు అంబటి వెంకటరాజం

viswatelangana.com
విద్యార్థినీ విద్యార్థులు ఏకాగ్రతతో ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి వెంకటరాజం విద్యార్థులకు సూచించారు. కోరుట్ల మండల జోగన్ పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు జోగన్ పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ నేతృత్వంలో గురువారం ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నులు పెన్సిళ్లు అందజేశారు. అనంతరం సైదు గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించాలని ప్రశాంతంగా చదివి పరీక్షలు రాయాలని మండల స్థాయిలో మంచి ఉత్తీర్ణత శాతం సాధించి అన్ని రంగాల్లో రాణించాలని విద్యార్థులలో ప్రేరణ కలగజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంబటి వెంకటరాజం మాట్లాడుతూ జీవితంలో గొప్పగా ఎదిగిన వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం జోగన్ పల్లి పదవ తరగతి విద్యార్థులకు 100% ర్యాంకు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని అంబటి వెంకట్రాజం పేర్కొన్నారు. వెంకట్ రాజం ప్రధానోపాధ్యాయులు ఇదివరకు చేసిన పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తమ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కేర్ తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థిని లోపాలు గమనించి అందరిని ఉన్నత స్థాయికి తీసుకువచ్చేందుకు ప్రతి చోట 100% రిజల్ట్ రావడానికి తీవ్రంగా కృషి చేసినట్లు పలువురు వెంకటరాజం ను అభినందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో విద్యార్థులు చేసిన అద్భుత నృత్య ప్రదర్శనలు చేసిన వారికి కూడా పరీక్ష ప్యాడ్స్ పెన్నులు ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎడుమల భూమారెడ్డి, పోతవేణి రాజశేఖర్, ముత్యపు రాజశేఖర్, కనికారాపు రాజేశం, పాఠశాల ఉపాధ్యాయల, కామిని లక్ష్మణ్, మహమ్మద్, పసియుద్దీన్, తునికి వెంకట సుదీర్, సిహెచ్ యుగధర్ రాజ్, బక్కశెట్టి తిరుపతి, అక్క జ్యోతి లక్ష్మి, పాలకుర్తి రామ్ నరేష్, పాల్గొన్నారు.



