కథలాపూర్
సీఎం రేవంత్ రెడ్డి పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్వి నాయకులపై ఫిర్యాదు

viswatelangana.com
March 15th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక కొందరు బిఆర్ ఎస్ వి నాయకులు కక్షపూర్వకంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కించ పరుస్తూ సోషల్ మీడియా లో వారి ఫోటో అగౌరవపరిచేలా చిత్రీకరిస్తున్న,అనుచిత వ్యాఖ్యలు చేసిన కొందరు బీఆర్ఎస్వీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యువజన కాంగ్రెస్ మరియు ఎన్ ఎస్ యు ఐ అధ్వర్యం లో కథలాపూర్ మండలం లోని పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు దొమ్మటి అర్జున్ గౌడ్,ఎన్.ఎస్.యు.ఐ వేములవాడ నియోజక వర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుల సంతోష్,యూత్ కాంగ్రెస్ వేములవాడ నియోజకవర్గ మాజీ ప్రధాన కార్యదర్శి రాధారపు సాయి తేజ, నల్ల ప్రదీప్, శేనిగారపు హేమంత్(మిట్టు) పాల్గొన్నారు….



