ఇరు పార్టీ వర్గాల మధ్య వివాదం తెచ్చిపెట్టిన ఫ్లెక్సీ

viswatelangana.com
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ మల్లన్న స్వామి జాతర మహోత్సవం సందర్భంగా అక్కడ చుట్టురా ఫ్లెక్సీ లు వెలుస్తున్నాయి కాగా పెద్దాపూర్ పక్కనే ఉన్నా రామారావు పల్లె గ్రామంలో ఒక్క ఫ్లెక్సీ రాజకీయ వర్గల్లో వివాదంగా మారింది అదేంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అలాగే నామినేటెడ్ పదవులు కూడా ఆ పార్టీ వారికి ఇచ్చారు. కానీ ఆ గ్రామంలో ఫ్లెక్సీ లో బి ఆర్ ఎస్ పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవి పేరు కోరుట్ల మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ పదవి పేరు ఉండడంతో ఇరు వర్గాల మధ్య పెద్ద చర్చలే నడుస్తున్నవి ఆలా ఫ్లెక్సీ పెట్టడం పై కాంగ్రెస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. ఇప్పుడున్న వైస్ చేర్మెన్ కు అవమానం జరిగిందని ఇది కావాలని ఆ పార్టీ నాయకులు పెట్టారని, ఇదివరకు ఇలా జరగలేదని ఇలా కక్షపూరితంగా చేస్తున్నారని రాజకీయ వర్గాలలో పలు చర్చలు జరుగుతున్నాయి. వెంటనే అధికారులు స్థానిక నాయకులు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



