కొడిమ్యాల
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జన్మ నక్షత్ర ప్రత్యేక పూజలు

viswatelangana.com
March 25th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని గోపూజ, పుష్పభిషేకం,అర్చన, ఆధ్యాత్మిక పారాయణ భజన బృందం పురణిపేట్ జగిత్యాల వరిచే విష్ణు సహస్ర నామ పారాయణం భక్తి గీతాలు భజన కార్యక్రమం, పల్లకి సేవ అనంతరం అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమం అర్చకులు నాగరాజు రమేష్, ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో దాతలు, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.(ఆత్మీయ మిత్రులకు స్వామివారి అనేక అనేక మంగళశాసనములు)



