కథలాపూర్
క్రీడాకారులను ప్రోత్సహించాలి టీషర్ట్స్ అందజేస్తున్న ఎజిబి గణేష్, బోలిశెట్టి శ్రీనివాస్

viswatelangana.com
March 26th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో ఎంపిఎల్ 3 మార్చి 29 న ప్రారంభమయ్యే కథలాపూర్ మండల క్రికెట్ ప్రీమియర్ లీగ్ లో ఊట్ పల్లి నుండి ఒక జట్టు తీసుకోవడం జరిగింది. ఈ టోర్నమెంట్ కి టీం కి జెర్సీ ల కోసం టీ షర్ట్ &ప్యాంట్స్ ల కొరకు క్రీడాకారులు ఎజిబి గణేష్, బోలిశెట్టి శ్రీనివాస్ లను అడగగా వెంటనే స్పందించి వాటిని అందజేశారు.వారు అడగగానే టీషర్ట్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ఎజిబి గణేష్, బోలిశెట్టి శ్రీనివాస్ లను క్రీడాకారులు అభినందించారు.



